టీడీపీలో చేరిన మంగళగిరి వైసీపీ కీలక నేత.. కండువా కప్పి ఆహ్వానించిన లోకేశ్
- తెలుగుదేశం పార్టీలో చేరిన మంగళగిరి వైసీపీ నేత వరప్రసాదరావు
- మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న మణి
- పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నారా లోకేశ్
- మంగళగిరి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు
మంగళగిరి పట్టణ వైసీపీ నాయకుడు, మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నాదుల వరప్రసాదరావు (మణి) టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో వరప్రసాదరావుతో పాటు ఆయన భార్య కృష్ణవేణి కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. మంగళగిరి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారిని కోరారు. నియోజకవర్గ పురోభివృద్ధికి అంతా కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు, చేనేత సంఘం అధ్యక్షుడి హోదాలో ఉన్న కీలక నేత టీడీపీలో చేరడం మంగళగిరి రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ చేరికతో నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.