పెళ్లయిన మర్నాడే.. పొలాల్లో శవమై కనిపించిన కొత్త పెళ్లికొడుకు
- ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘటన
- గ్రామ సమీపంలోని తోటలో చెట్టుకు వేలాడుతూ కనిపించిన వైనం
- పోస్టుమార్టం, చట్టపరమైన చర్యలకు నిరాకరించిన కుటుంబసభ్యులు
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివాహమైన మరునాడే ఓ నవ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీవితంలో కొత్త అధ్యాయం మొదలుకావాల్సిన సమయంలో, పెళ్లైన గంటల వ్యవధిలోనే ఈ ఘోరం జరగడంతో ఆ కుటుంబంలో పెను విషాదం అలుముకుంది.
యూనస్ అనే యువకుడికి మంగళవారం ఘనంగా వివాహం జరిగింది. బంధుమిత్రులతో కలిసి ఊరేగింపుగా వెళ్లి వధువును ఇంటికి తీసుకొచ్చాడు. నూతన దంపతులకు కుటుంబసభ్యులు బాణసంచా కాలుస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఆ రాత్రి అంతా సంతోషంగానే గడిచింది. అంతా సవ్యంగానే ఉందని కుటుంబసభ్యులు భావించారు.
అయితే, బుధవారం ఉదయం యూనస్ ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. గ్రామ సమీపంలోని ఓ పండ్ల తోటలోకి వెళ్లి, అక్కడ చెట్టుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పొలంలో మృతదేహాన్ని గమనించిన ఓ రైతు గ్రామస్థులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న యూనస్ కుటుంబసభ్యులు, ఖర్ఖోడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించారు.
యూనస్ మృతికి గల కారణాలు ఏంటనేది స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించేందుకు ప్రయత్నించగా, కుటుంబసభ్యులు అడ్డుపడ్డారు. తమకు ఎలాంటి పోస్టుమార్టం గానీ, చట్టపరమైన చర్యలు గానీ వద్దని పోలీసులకు స్పష్టం చేశారు. దీంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబసభ్యులు ఎందుకు నిరాకరిస్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.