ఏ గాలి ఎవరిని ఎటు తీసుకెళుతుందో: శింబు 'ముత్తు' తెలుగు ట్రైలర్ రిలీజ్!
- విభిన్నమైన కథా చిత్రంలో శింబు
- కథానాయికగా నటించిన సిద్ధి ఇద్నాని
- ఆసక్తిని రేకెత్తిస్తున్న ట్రైలర్
- ఈ నెల 17వ తేదీన సినిమా విడుదల
తాజాగా ఈ సినిమా నుంచి రమ్యకృష్ణ వాయిస్ ఓవర్ పై తెలుగు ట్రైలర్ ను వదిలారు. 'ఏ గాలి ఎవరిని ఎటు తీసుకుని వెళుతుందో ఎవరికీ తెలియదు. మొదలు ... అంతం లేనిదానినే విధి అంటారా? అందరూ తప్పించుకునే ప్రయత్నంలోనే ఉన్నారు .. కానీ మరింత ఇరుక్కుపోతున్నారు' అంటూ సాగే వాయిస్ ఓవర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
శింబు తల్లిగా ఈ సినిమాలో రాధిక కీలకమైన పాత్రను పోషించగా, ఆయన సరసన నాయికగా సిద్ధి ఇద్నాని అలరించనుంది. ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ అందించిన సంగీతం హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. తమిళ .. తెలుగు భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.