Raviteja: రవితేజ జోడీగా అనుపమ పరమేశ్వరన్!

  • 'కార్తికేయ 2'తో అనుపమకు హిట్ 
  • రిలీజ్ కి రెడీగా '18 పేజెస్'
  • షూటింగు దశలో 'బట్టర్ ఫ్లై'
  • 'ఈగల్' సినిమాకి గ్రీన్ సిగ్నల్
Eagle movie update

కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ కి 'కార్తికేయ 2' భారీ హిట్ ను అందించింది. ఆమె కెరియర్లో 100 కోట్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. ప్రస్తుతం ఆమె ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఆ తరువాత సినిమాలుగా ఆమె నుంచి రావడానికి '18 పేజెస్' .. ' బట్టర్ ఫ్లై' రెడీ అవుతున్నాయి.

తాజాగా ఆమె రవితేజ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. 'కార్తికేయ 2' సినిమాకి సినిమాటోగ్రఫర్ గా .. ఎడిటర్ గా వ్యవహరించిన కార్తీక్ ఘట్టమనేని, దర్శకుడిగా రవితేజతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి 'ఈగల్' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నారు. 

ఈ సినిమాలో కథానాయికగా ఆయన అనుపమను తీసుకున్నట్టుగా సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మధ్య కాలంలో రవితేజ వరుసగా కుర్ర హీరోయిన్లతో జోడీ కడుతూ వస్తున్నాడు. ఆ జాబితాలోకి అనుపమ చేరడం విశేషం. 'ఈగల్' కి సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News