Simbu: శింబు 'ముత్తు' మూవీ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

  • శింబు హీరోగా రూపొందిన 'ముత్తు'
  • కథానాయికగా సిద్ధి ఇద్నాని 
  • కీలకమైన పాత్రలో రాధిక 
  • సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్ 
  • ఈ నెల 15వ తేదీన సినిమా విడుదల
Muthu Movie lyrical song released

శింబు హీరోగా తమిళంలో 'వెందు తుణీందదు కాడు' సినిమా రూపొందింది. గణేశ్ నిర్మించిన ఈ సినిమాకి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించాడు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాకి 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

గ్రామీణ నేపథ్యంలో మురికివాడకి చెందిన చదువులేని కుర్రాడిగా ఈ సినిమాలో శింబు కనిపించనున్నాడు. తన తల్లిని .. చెల్లిని వెంటబెట్టుకుని బ్రతకడానికి పట్నం వచ్చిన ఆ కుర్రాడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే కథ. అలాంటి కుర్రాడు ప్రేమలో ఎలా పడ్డాడనేది మరో కథ. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సంబంధించిన లిరికల్ సాంగును రిలీజ్ చేశారు.

'నిన్నే తలదన్నే సరిజోడీ నాకిక లేదే, ఇక కల్లో కూడా నువ్వు నేను వేరే కాదే' అంటూ ఈ పాట సాగుతోంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి, కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా, సామ్ విశాల్ - రక్షిత  సురేశ్  ఆలపించారు. సిద్ధి ఇద్నాని కథానాయికగా నటించిన ఈ సినిమాలో, రాధిక కీలకమైన పాత్రలో కనిపించనుంది

More Telugu News