విశాఖలోని అత్యంత ఎత్తయిన వినాయక విగ్రహం కూలిపోయే ముప్పు ఉందంటున్న పోలీసులు
- గాజువాకలో తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తయిన గణేశ్ విగ్రహం
- 89 అడుగుల ఎత్తుతో భారీ గణపతి
- ఒక అడుగు మేర పక్కకి ఒరిగిపోయిందంటున్న పోలీసులు
- వెంటనే నిమజ్జనం చేయాలని సూచన
దాంతో, విగ్రహాన్ని పరిశీలించాలని పోలీసులు ఆర్ అండ్ బి అధికారులను కోరారు. విగ్రహాన్ని పరీక్షించిన ఆర్ అండ్ బి అధికారులు ప్రమాదానికి అవకాశాలు ఉన్నాయంటూ తమ నివేదికలో స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో, వినాయక విగ్రహాన్ని వెంటనే నిమజ్జనం చేయాలని పోలీసులు మండపం నిర్వాహకులకు సూచించారు. అయితే, ముందస్తు నిమజ్జనానికి నిర్వాహకుల కమిటీ అంగీకరించలేదు. ఈ నెల 18న నిమజ్జనం చేస్తామని నిర్ణయించింది. దాంతో, విగ్రహానికి 100 మీటర్ల లోపు ఎవరినీ అనుమతించవద్దని పోలీసులు తాజా హెచ్చరికలు చేశారు.