సొంతూళ్లోని తన ఇంటి ఫొటోను పోస్ట్ చేసిన అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప
- వరుస వివాదాల్లో అనంతపురం ఎస్పీ ఫకీరప్ప
- తాజాగా కానిస్టేబుల్ ఫిర్యాదుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
- ఆరోపణలను ఖండిస్తూ తన ఇంటి ఫొటోను పంచుకున్న ఐపీఎస్ అధికారి
ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానంగా... తన వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టేలా ఫకీరప్ప బుధవారం సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటోను షేర్ చేశారు. కర్ణాటకలోని హవేరీ జిల్లా నెలగోల్ గ్రామం తన సొంతూరని, తన ఊళ్లో తన ఇల్లు ఇదేనని ఆయన ఆ ఫొటోను పోస్ట్ చేశారు. తన గురించి ఆరోపణలు చేస్తున్న వారికి తన ఇంటి ఫొటోతోనే సమాధానం చెబుతూ ఆయన ఈ ఫొటోను షేర్ చేశారు. తనపై అనుమానం ఉన్న వారంతా ఇది తనదేనని తెలుసుకోవాలి అంటూ ఆయన ఆ ఫొటోకు ఓ కామెంట్ జత చేశారు.