తెలంగాణ రాజకీయాలపై ప్రియాంకా గాంధీ సమావేశం... హాజరైన బోసురాజు
- ఇటీవలే రేవంత్, ఉత్తమ్‌లతో ప్రియాంకా గాంధీ భేటీ
- తాజా భేటీలో తెలంగాణ రాజకీయ పరిస్థితులపై చర్చ
- మునుగోడు ఉప ఎన్నికలపైనా చర్చించిన పార్టీ కీలక నేత
తాజాగా శనివారం నాటి భేటీలో తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, పార్టీ సంస్థాగత అంశాలపై ప్రియాంకా గాంధీ దృష్టి సారించినట్లు సమాచారం. అదే సమయంలో త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక, ఎన్నికలో పార్టీ విజయావకాశాలు, ఎన్నికల్లో నిలిచే పార్టీ అభ్యర్థి అంశంపైనా ప్రియాంకా చర్చించినట్లు సమాచారం.