ధనశ్రీతో విడాకులు అంటూ ప్రచారం... స్పందించిన టీమిండియా బౌలర్ చహల్
- సోషల్ మీడియాలో పోస్టులతో గందరగోళం
- అవన్నీ పుకార్లేనన్న చహల్
- వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి
- ప్రచారానికి ఇంతటితో ముగింపు పలకాలని పిలుపు
చహల్ 2020లో దంతవైద్యురాలు ధనశ్రీని వివాహం చేసుకున్నాడు. ధనశ్రీ డెంటిస్ట్ మాత్రమే కాదు యూట్యూబర్, కొరియోగ్రాఫర్ కూడా. పెళ్లికి ముందు వీరిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లయిన తర్వాత సోషల్ మీడియాలో ఈ జంట అల్లరి అంతా ఇంతా కాదు. అనేక వీడియోలు, పోస్టులో అభిమానులకు కావల్సినంత వినోదం అందిస్తుంటారు.
అయితే, ఈ జంట విడిపోనుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై చహల్ స్పందించాడు. తమ వైవాహిక బంధంపై వస్తున్నవన్నీ పుకార్లేనని, దయచేసి వాటిని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశాడు. వాటికి ఇంతటితో ముగింపు పలకాలని కోరాడు. ప్రతి ఒక్కరి జీవితం ప్రేమతో వెలిగిపోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపాడు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు.