'సీతా రామం' ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపే!
- ప్రేమకథా చిత్రంగా రూపొందిన 'సీతా రామం'
- కథానాయికగా పరిచయమవుతున్న మృణాళ్ ఠాకూర్
- కీలకమైన పాత్రను పోషించిన రష్మిక
- ఈ నెల 5వ తేదీన విడుదలవుతున్న సినిమా
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు ప్లాన్ చేశారు. రేపు రాత్రి 7 గంటలకు ఈ వేడుక మొదలుకానుంది. ఇందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఇంతవరకూ మరాఠీ సినిమాలను ఎక్కువగా చేస్తూ వచ్చిన మృణాల్ ఠాకూర్, ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతోంది.
విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో రష్మిక కీలకమైన పాత్రను పోషించింది. ఇతర ముఖ్యమైన పాత్రల్లో భూమిక .. సుమంత్ .. తరుణ్ భాస్కర్ కనిపించనున్నారు. ప్రేమకథల స్పెషలిస్టుగా హను రాఘవపూడికి మంచి పేరు ఉంది. మరి ఈ లవ్ స్టోరీ యూత్ ను ఏ స్థాయిలో మెప్పిస్తుందన్నది చూడాలి.