Raviteja: 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్!

  • రవితేజ తాజా చిత్రంగా రానున్న 'రామారావు ఆన్ డ్యూటీ'
  • ఈ నెల 29వ తేదీన భారీస్థాయిలో విడుదల 
  • నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • తనకి స్ఫూర్తి రవితేజ అని చెప్పిన నాని 
  • నాని సౌత్ లోనే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రశంసించిన రవితేజ 
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ముగ్గురు నాయికలు  
Ramarao On Duty movie Pre Releease Event

రవితేజ తన తాజా చిత్రమైన 'రామారావు ఆన్ డ్యూటీ' ఈ నెల 29వ తేదీన థియేటర్లకు రావడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి హైదరాబాద్ - ఫిల్మ్ నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహించారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హీరో నాని .. ప్రత్యేక అతిథిగా దర్శకుడు బాబి హాజరయ్యారు.

రవితేజ మాట్లాడుతూ .. "శరత్ మండవ ఈ సినిమాను గొప్పగా తీశాడు. ఇంతవరకూ ఇలాంటి ఒక పాత్రలో నేను చేయలేదు. ఈ సినిమాలోని 'సీసా' సాంగ్ ఒక ఊపు ఊపేయడం ఖాయం. సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశాడు. చీఫ్ గెస్టుగా నాని రావడం ఆనందంగా ఉంది. పర్సనల్ గా .. ప్రొఫెషనల్ గా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. తాను సౌత్ ఇండియాలోనే గొప్పనటుడు" అన్నాడు. 

నాని మాట్లాడుతూ .. "చీఫ్  గెస్టుగా పిలిచారని నేను ఇక్కడికి  రాలేదు. రవన్నయ్య గురించి నాలుగు మాటలు మాట్లాడవచ్చని వచ్చాను. తను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తనకి చిరంజీవిగారు ప్రేరణ అయితే, నేను ఇండస్ట్రీకి రావడానికి తను స్ఫూర్తి. మెగాస్టార్ తో చేసే అవకాశం రవన్నయ్యకి వచ్చినట్టే, తనతో కలిసి నటించే అవకాశం నాకు రావాలని కోరుకుంటున్నాను. 20 ఏళ్లుగా తాను ఆన్ డ్యూటీలోనే ఉన్నాడు" అంటూ చెప్పుకొచ్చాడు.  

ఇక బాబీ మాట్లాడుతూ .. రవితేజ చేసిన హెల్ప్ వల్లనే తాను ఇండస్ట్రీలో నిలబడగలిగానని అన్నాడు. ఆయన సహకారం వల్లనే ' జై  లవకుశ' చేయగలిగినట్టు చెప్పాడు. ఇక దర్శకుడు శరత్ మండవ మాట్లాడుతూ .. ట్విట్టర్ లు చూడటం మానేసి థియేటర్లకి వెళ్లండి .. ట్విట్టర్లలో పిట్టలు రెట్టలు మాత్రమే వేస్తాయి అన్నాడు. ఇక ఈ స్టేజ్ పై ముగ్గురు కథానాయికలు అందంగా మెరుస్తూ ప్రత్యేక  ఆకర్షణగా నిలిచారు.

More Telugu News