Raviteja: రేపే 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రీ రిలీజ్ ఈవెంట్! 

  • రవితేజ తాజా చిత్రంగా 'రామారావు ఆన్ డ్యూటీ'
  • దర్శకుడిగా శరత్ మండవ పరిచయం 
  • హైదరాబాదులో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ఈ నెల 29వ తేదీన సినిమా విడుదల
Ramarao On Duty movie update

రవితేజ హీరోగా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా రూపొందింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ద్వారా శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రవితేజను ఆయన ఈ సినిమాలో సబ్ కలెక్టర్ గా చూపించనున్నాడు. సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. హైదరాబాద్ - ఫిల్మ్ నగర్ .. జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ వేడుక నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. ఈ  విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు.

రవితేజ అభిమానులు 'వైట్ షర్ట్స్'తో రావాలని ఈ పోస్టర్ ద్వారా చెప్పారు. 'మజిలీ' తరువాత దివ్యాన్ష చేసిన సినిమా ఇది. ఇక రజీషా విజయన్ కి తెలుగులో ఇదే తొలి సినిమా. ఈ సినిమాతోనే తొట్టెంపూడి వేణు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో నాజర్ .. పవిత్ర లోకేశ్ కనిపించనున్నారు.

More Telugu News