'దసరా'లో లేడీ విలనిజమే హైలైట్ అట!

Dasara movie upadate
షార్ట్స్‌లో చూడండి
హీరోగా నాని కథల్లో కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ ఉంటాడు. అలాగే కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆయన తాజా చిత్రమైన 'దసరా' ద్వారా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు సింగరేణి బొగ్గు గనుల్లో జరుగుతోంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 

ఈ సినిమాకి లేడీ విలనిజం హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. లేడీ విలన్ గా కనిపించనున్నది ఎవరో కాదు .. పూర్ణ. ఆమెకి సంబంధించిన పోర్షన్ ను చాలావరకూ చిత్రీకరించారట. ఈ విషయాన్ని పూర్ణ ధ్రువీకరించింది కూడా. తన కెరియర్లో ఈ పాత్ర చెప్పుకోదగినది అవుతుందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసింది. 

సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ సందడి చేయనుంది. నానీతో ఆమె చేస్తున్న రెండవ సినిమా ఇది. డిసెంబర్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మాస్ లుక్ తో నాని ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి మరి.
Go Back to Shorts
Nani
Keerthi Suresh
Poorna
Dasara Movie

More Telugu News