ఎస్సై పోస్టుల రాత పరీక్షను మార్చాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్... కారణం కూడా చెప్పిన బీఎస్పీ నేత
- ఆగస్టు 7న తెలంగాణ ఎస్సై పోస్టుల రాత పరీక్ష
- అదే రోజున సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, బ్యాంకు పరీక్షలు
- తెలంగాణకు చెందిన నిరుద్యోగులు వీటికి హాజరవుతున్నారన్న ప్రవీణ్
ఎస్సై పోస్టుల రాత పరీక్ష తేదీని మార్చాల్సిన ఆవశ్యకతను కూడా చెబుతూ ఆయన ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ఆగస్టు 7న సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పరీక్షతో పాటు బ్యాంకు ఉద్యోగాల భర్తీకి దేశవ్యాప్తంగా పరీక్షలు జరగనున్నాయని ఆయన తెలిపారు. ఈ పరీక్షలకు తెలంగాణకు చెందిన నిరుద్యోగులు హాజరవుతున్నారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఎస్సై పోస్టుల రాత పరీక్షను మరో తేదీకి మార్చాలని ఆయన కోరారు.