థియేటర్లకు వెళ్లి సందడి చేసిన సాయి పల్లవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

థియేటర్లకు వెళ్లి సందడి చేసిన సాయి పల్లవి

Sai Pallavi visits theatres in Chennai Hyderabad
  • చెన్నై, హైదరాబాద్ లోని పలు థియేటర్ల సందర్శన
  • అభిమానులతో సరదా ముచ్చట్లు 
  • ఆమె వెంట దర్శకుడు గౌతమ్ రామచంద్రన్
నటి సాయి పల్లవి నటించిన ‘గార్గి’ సినిమా మంచి స్పందన అందుకుంటోంది. ఈ నెల 15న ఈ సినిమా విడుదల కాగా, ప్రదర్శిస్తున్న థియేటర్లకు సాయి పల్లవి స్వయంగా వెళ్లి సందడి చేస్తోంది. చెన్నై, హైదరాబాద్ లోని పలు థియేటర్లను ఆమె సందర్శించి కొద్ది సమయం పాటు తన సినిమాను వీక్షించడమే కాకుండా, అభిమానుల కేరింతలను స్వయంగా చూశారు. వారితో సరదాగా ముచ్చటించారు.

పలుచోట్ల అభిమానులు ఈలలు వేస్తూ సాయి పల్లవికి స్వాగతం పలికారు. ఆమె వెంట దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ కూడా ఉన్నారు. చిన్నారులపై లైంగిక అంశాన్ని కథాంశంగా ఎంపిక చేసుకుని సామాజిక చిత్రాన్ని రూపొందించిన దర్శకుడితోపాటు నటి సాయి పల్లవిని అభిమానులు అభినందించారు. తమిళ నటుడు సూర్య ఇప్పటికే ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. చాలా కాలం తర్వాత గొప్పగా రచించి, గొప్పగా రూపొందించిన సినిమాగా ఇది గుర్తుండిపోతుందన్నారు. 

Sai Pallavi
visits
theatres
Chennai
Hyderabad
Gargi

More Telugu News