'అఖండ' రోజునే రానున్న బాలయ్య 107వ సినిమా!
- షూటింగు దశలో బాలయ్య 107వ సినిమా
- కథానాయికగా అలరించనున్న శ్రుతిహాసన్
- గోపీచంద్ మలినేనితో ఆమెకి ఇది మూడో సినిమా
- డిసెంబర్ 2వ తేదీన విడుదల చేసే అవకాశం
బాలయ్య సరసన కథానాయికగా శ్రుతి హాసన్ నటిస్తోంది. 'బలుపు' .. 'క్రాక్' వంటి హిట్స్ తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆమె చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను 'దసరా' కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ బాలయ్యకి కరోనా రావడం వలన షూటింగు వాయిదా పడింది. ఈ ఆలస్యం రిలీజ్ డేట్ పై పడిందని అంటున్నారు.
బాలయ్య ఇంతకుముందు చేసిన 'అఖండ' డిసెంబర్ 2వ తేదీన విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. అదే సెంటిమెంట్ తో అదే రోజున ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని అంటున్నారు. విలన్ గా ఈ సినిమాలో దునియా విజయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.