Raviteja: 'రామారావు' పైనే ఆశలు పెట్టుకున్న దివ్యాన్ష!

  • 'మజిలీ'తో పరిచయమైన దివ్యాన్ష
  • తొలి సినిమాతోనే వచ్చిన సక్సెస్ 
  • అయినా దక్కని క్రెడిట్
  • 'రామారావు ఆన్ డ్యూటీ'పైనే నమ్మకం 
  • ఈ నెల 29వ తేదీన విడుదలవుతున్న సినిమా 
Ramarao On Duty movie update

తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన కథానాయికలలో దివ్యాన్ష కౌశిక్ ఒకరు. 'మజిలీ' సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో ఆమె గ్లామర్ కీ .. నటనకీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా తరువాత టాలీవుడ్ లో ఈ సుందరి బిజీ కావడం ఖాయమని అనుకున్నారు.

కానీ అలా జరగలేదు .. దివ్యాన్ష గురించి బయట ఎవరూ ఎక్కువగా మాట్లాడుకోలేదు. అందుకు కారణం ఆ సినిమా క్రెడిట్ అంతా కూడా సమంత ఎకౌంట్ కి వెళ్లిపోవడమే. దాంతో సరైన అవకాశం కోసం ఎదురుచూస్తుండిపోయిన దివ్యాన్ష, ఆ తరువాత సినిమాగా 'రామారావు ఆన్ డ్యూటీ' చేసింది.

రవితేజ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి శరత్ మండవ దర్శకత్వం వహించాడు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో తన పాత్రకి మంచి ప్రాధాన్యత ఉందనీ .. మంచి గుర్తింపు వస్తుందని దివ్యాన్ష ఆశపడుతోంది. తన కెరియర్  కి హెల్ప్ అవుతుందని ఆశిస్తోంది. ఆమె నమ్మకాన్ని ఏ సినిమా నిలబెడుతుందేమో చూడాలి మరి.      


More Telugu News