రవితేజకి బదులుగా మరో హీరోను ట్రై చేస్తున్న బాబీ!
- బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న 'వాల్తేర్ వీరయ్య'
- మెగాస్టార్ కి ఇది 154వ సినిమా
- కథాపరంగా మరో హీరోకి చోటు
- వచ్చే వేసవిలో సినిమా విడుదల
ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం రవితేజను అనుకున్నారు. ఆయన కూడా మెగాస్టార్ కోసం ఆ పాత్రను చేయడానికి ఒప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన ఈ సినిమాలో చేసే అవకాశం లేదని తెలుస్తోంది. తన సినిమాల షెడ్యూల్స్ వెంటవెంటనే ఉండటం వలన, డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పాడని టాక్.
దాంతో బాబీ ఆ పాత్ర కోసం మరో హీరోను ఎంపిక చేసుకునే పనిలో పడినట్టుగా చెబుతున్నారు. ఈ విషయంలో ఆల్రెడీ ఒకరిద్దరు హీరోలను సంప్రదించినట్టుగా కూడా తెలుస్తోంది. చివరికి ఆ పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేస్తారనేది చూడాలి. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు.