Nikhil: ఈ నెలలో రిలీజ్ డౌటే .. ఆలోచనలో పడిన 'కార్తికేయ 2'

Karthikeya 2 movie update
షార్ట్స్‌లో చూడండి
నిఖిల్ హీరోగా కొంతకాలం క్రితం వచ్చిన 'కార్తికేయ' భారీ విజయాన్ని సాధించింది. దాంతో దర్శకుడు చందూ మొండేటి .. నిఖిల్ ఇద్దరూ కలిసి ఆ సినిమాకి సీక్వెల్ చేశారు. 'కార్తికేయ 2' టైటిల్ తో రూపొందిన ఈ సినిమాలో నిఖిల్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. కాలభైరవ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. 

ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా వదిలారు. కానీ ఇప్పుడు ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాక పోవడమే అందుకు కారణమనే ప్రచారం జరుగుతోంది. 

అంతేకాకుండా అదే రోజున చైతూ 'థ్యాంక్యూ' .. సుదీప్ 'విక్రాంత్ రోణ' సినిమాలు విడుదలకు ఉండటం కూడా మరో కారణంగా వినిపిస్తోంది. అయితే 'కార్తికేయ 2' కంటెంట్ .. దాని జోనర్ వేరు. వేరే సినిమాలు దీనికి పోటీ అనుకోలేం. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన రావలసిందే.
Go Back to Shorts
Nikhil
Anupama
karthikeya 2

More Telugu News