Raviteja: 'రామారావు ఆన్ డ్యూటీ' నుంచి ఐటమ్ సాంగ్ రిలీజ్!

Ramarao On Duty movie lyrical song released
షార్ట్స్‌లో చూడండి
రవితేజ కథానాయకుడిగా 'రామారావు ఆన్ డ్యూటీ' రూపొందింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి రవితేజ కూడా ఒక భాగస్వామిగా ఉన్నాడు. దివ్యాన్ష కౌశిక్ - రజీషా విజయన్ కథానాయికలుగా నటించారు. సామ్ సీ ఎస్ సంగీతాన్ని సమకూర్చాడు. 

తాజాగా ఈ సినిమా నుంచి ఐటమ్ సాంగ్ ను లిరికల్ వీడియోగా వదిలారు. "నా పేరు సీసా .. ఒకరికి నే తేనెసీసా .. ఒకరికి నే కల్లుసీసా .. ఒకరికి నే మసాలా సీసా .. ఇంకొకరికి రసాల సీసా .. అందరికీ అందించేస్తా స్వర్గానికి  వీసా' అంటూ ఈ పాట మంచి ఊపుతో ఉత్సాహంగా సాగుతోంది. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను శ్రేయా ఘోషల్ ఆలపించింది. 

శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీని అందించాడు. యూత్ తో పాటు మాస్ ను కూడా ఆకట్టుకునే బీట్ ఇది. జులై 29వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో  విడుదల చేయనున్నారు. దర్శకుడిగా శరత్ మండవ పరిచయమవుతున్న ఈ సినిమా తనకి తప్పకుండా పెద్ద హిట్ ఇస్తుందనే నమ్మకంతో  రవితేజ ఉన్నాడు.
Go Back to Shorts
Raviteja
Divyansha
Rajesha Vijayan

More Telugu News