సాయంత్రం 5 గంటల భేటీకి రాని వారంతా పార్టీలో లేనట్టే: శివసేన కీలక ప్రకటన
- 40 మంది ఎమ్మెల్యేలతో మంత్రి ఏక్‌నాథ్ షిండే క్యాంపు
- చివరి ప్రయత్నంగా అత్యవసర సమావేశానికి శివసేన పిలుపు
- ఉద్ధవ్ థాకరే నివాసంలో బుధవారం సాయంత్రం 5 గంటలకు సమావేశం
- సమావేశానికి రాని వారిపై పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ప్రయోగించే దిశగా అడుగులు
ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం 5 గంటలకు సీఎం ఉద్ధవ్ థాకరే నివాసంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా హాజరు కావాల్సిందేనని శివసేన అల్టిమేటం జారీ చేసింది. ఈ సమావేశానికి హాజరు కాని వారిని పార్టీలో లేని వారిగానే గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు పార్టీకి చెందిన ఎమ్మెల్యేందరికీ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు ఓ లేఖ పంపారు. ఈ సమావేశానికి హాజరు కాని ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ప్రయోగించే దిశగా శివసేన అడుగులు వేస్తున్నట్లు సమాచారం.