'మహా' సీఎం ఉద్ధవ్ థాకరేకి కరోనా పాజిటివ్

Uddhav Thackeray tested Corona positive
  • ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్న థాకరే
  • రాజకీయ సంక్షోభం నెలకొన్న సమయంలో కరోనా బారిన పడిన థాకరే
  • మహారాష్ట్ర గవర్నర్ కొశ్యారీకి కూడా కరోనా
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఐసొలేషన్ లో ఉన్నారు. థాకరే కరోనా బారిన పడిన విషయాన్ని కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ప్రకటించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. శివసేన కీలకనేత ఏక్ నాథ్ షిండే తన వర్గ ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర కేబినెట్ అత్యవసరంగా భేటీకాబోతోంది. ఈ సమయంలో థాకరే కరోనా బారిన పడ్డారు. 

మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ కూడా కరోనా బారిన పడ్డారు. తాను కరోనా బారిన పడినట్టు ఈ ఉదయం ఆయన వెల్లడించారు. తనకు కరోనా నిర్ధారణ అయిందని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. లక్షణాలు తక్కువగా ఉన్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రిలో చేరానని చెప్పారు.
Go Back to Shorts
Uddhav Thackeray
Corona Positive
Maharashtra

More Telugu News