Rana Daggubati: ఇకపై మీ కోసం సినిమాలు చేస్తాను .. పిచ్చెక్కించేద్దాం: రానా

  • రానా కీలకమైన పాత్రను పోషించిన 'విరాటపర్వం'
  • నక్సలైట్ గా కనిపించనున్న రానా 
  • ఇకపై ప్ర్రయోగాలు చేయనని వ్యాఖ్య 
  • అభిమానులు ఆశించే కథలను చేస్తానంటూ స్పష్టీకరణ
Virataparvam movie update

'విరాటపర్వం' సినిమా సాయిపల్లవి చుట్టూ తిరుగుతుందనీ, తాను ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషించానని ఒక ఇంటర్వ్యూలో రానా చెప్పారు. నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో ఆయన మాట్లాడుతూ, ఇకపై ఈ తరహా పాత్రలను చేయననే ఉద్దేశంతో మాట్లాడటం గమనించవలసిన విషయం. 

ఈ వేదికపై రానా మాట్లాడుతూ .. "ఇంతవరకూ నేను విక్టరీ వెంకటేశ్ గారికే తప్ప నాకు ఫ్యాన్స్ లేరని అనుకున్నాను. కొత్త కొత్త కథలు చేయాలనీ, కొత్త పాత్రల్లో కనిపించాలని అనుకున్నాను. కానీ ఈ సినిమా సమయంలో నాకు ఎంతమంది అభిమానులు ఉన్నారనేది అర్థమైంది. వాళ్లంతా కూడా ఈ సినిమా చేయవద్దనే చెప్పారు.

ఒక యాక్టర్ గా నేను చేసిన చివరి ప్రయోగం అనుకోండి. ఇక్కడి నుంచి ప్రతి సినిమా మీ కోసం చేస్తూ ఉంటాను .. పిచ్చెక్కించేద్దాం" అంటూ చెప్పుకొచ్చారు. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను, సురేశ్ బాబు .. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News