వెన్నెల పుట్టిందే పోరాటంలో.. ఆసక్తిని పెంచుతున్న 'విరాటపర్వం' ట్రైలర్
- వేణు ఉడుగుల రూపొందించిన 'విరాటపర్వం'
- ప్రేమ - పోరాటం నేపథ్యంలో సాగే కథ
- అంచనాలు పెంచుతున్న ట్రైలర్
- ఈ నెల 17వ తేదీన సినిమా రిలీజ్
ట్రాక్టర్ పై ఆమెను హాస్పిటల్ కి తీసుకుని వెళుతూ, నక్సలైట్స్ కీ .. పోలీసులకి మధ్య జరుగుతున్న కాల్పుల్లో చిక్కుకుంటారు. అప్పుడు ఒక లేడీ నక్సలైట్ ఆమెకి పురుడు పోసి .. ఆ పాపకి 'వెన్నెల' అనే పేరు పెడుతుంది. ఆ మరుక్షణమే ఆ లేడీ నక్సలైట్ పోలీస్ తూటాలకు బలవుతుంది.
అలా పోరాటంలో పుట్టిన ఆ వెన్నెలనే ఈ సినిమా కథానాయిక సాయిపల్లవి. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా .. ఎమోషనల్ గా ఉంది. సినిమాపై ఆసక్తిని రేకెత్తించేదిగా ఉంది. అటవీ ప్రాంతంలో చీకట్లో మగ్గుతున్న జీవితాలకు వెలుగునిచ్చే పాత్రను సాయిపల్లవి పోషించిందని అనుకోవచ్చు. ప్రేమ - పోరాటం ఈ రెండింటికీ మధ్య ఈ కథ నడుస్తుందని భావించవచ్చు.