రేపు 'విరాటపర్వం' గ్రాండ్ ఈవెంటును అక్కడ ఫిక్స్ చేశారు!
- సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'విరాటపర్వం'
- నక్సలిజం నేపథ్యంలో సాగే కథ
- కర్నూల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఈ నెల 17వ తేదీన సినిమా విడుదల
కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీని .. వేదికను ఖరారు చేశారు. రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను 'కర్నూల్' లో నిర్వహించనున్నారు.
అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చాడు. ప్రియమణి .. నందితా దాస్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న రానాకి ఈ సినిమా ఆ లోటు తీరుస్తుందేమో చూడాలి.