పేగు తెంచుకుపుట్టిన ఆరుగురు పిల్లలను బావిలోకి తోసేసిన తల్లి.. అందరూ మృతి
- భర్త, అత్తింటి వారి వేధింపులు భరించలేక తీవ్ర నిర్ణయం
- అదే బావిలోకి దూకి ఆమె కూడా ఆత్మహత్యాయత్నం
- పిల్లలంతా 18 నెలల నుంచి పదేళ్ల లోపు వారే
పిల్లలను బావిలో పడేసిన ఆ తల్లిని రూనా సహానీగా గుర్తించారు. ఆ వివరాలను మహద్ పోలీసులు వెల్లడించారు. మద్యానికి బానిసైన తన భర్త వేధింపులను భరించలేకే ఆమె ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకున్నామని, ఏ విషయమూ చెప్పే పరిస్థితిలో లేదని తెలిపారు. నిన్న రాత్రి 10 గంటల వరకు పిల్లల మృతదేహాలను బావి నుంచి బయటకు తీసినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.