Virataparvam: ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'విరాటపర్వం'... కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్రబృందం

  • రానా, సాయిపల్లవి జంటగా విరాటపర్వం
  • వేణు ఉడుగుల దర్శకత్వంలో చిత్రం
  • ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా
  • తాజాగా కొత్త రిలీజ్ డేట్ ఖరారు  
  • జూన్ 17న వరల్డ్ వైడ్ రిలీజ్
Virataparvam release date announced

రానా దగ్గుబాటి, సాయిపల్లవి నటించిన విభిన్న ప్రేమకథా చిత్రం విరాటపర్వం. ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విరాటపర్వం చిత్రాన్ని జూన్ 17న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం నేడు ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ వీడియో పంచుకుంది. నక్సలిజం బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న విరాటపర్వం చిత్రానికి వేణు ఉడుగుల దర్శకుడు. 

ఈ సినిమా గతేడాదే విడుదల కావాల్సి ఉన్నా, కరోనా వ్యాప్తి, ఇతర పరిస్థితుల నేపథ్యంలో పలుమార్లు వాయిదాపడింది. ఇప్పుడు కూడా వాయిదా పడుతుందన్న వార్తల నేపథ్యంలో, చిత్రబృందం విడుదల తేదీని నిర్ధారించింది. ఈ సినిమాకు సుధాకర్ చెరుకూరి నిర్మాత. 

దగ్గుబాటి సురేశ్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రంలో రానా, సాయిపల్లవి, నివేదా పేతురాజ్, సాయిచంద్, నందిదాతాస్, ప్రియమణి తదితరులు నటిస్తున్నారు. విరాటపర్వం చిత్రానికి సురేశ్ బొబ్బిలి సంగీతం అందించాడు.

More Telugu News