RRR: బీ రెడీ! ఓటీటీలో విడుదలకు సిద్ధమైన ఆర్ఆర్ఆర్.. పండగ చేసుకుంటున్న అభిమానులు

RRR Releasing on OTT On May 20th on Zee5
షార్ట్స్‌లో చూడండి
ఎన్టీఆర్, రాంచరణ్ అభిమానులకు ఇది శుభవార్తే. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్‌లో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆర్ఆర్ఆర్’ త్వరలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అడుగుపెట్టబోతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న జీ5.. ట్రిపులార్ డిజిటల్ ప్రీమియర్ డేను ప్రకటించింది. 

ఈ నెల 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆర్ఆర్ఆర్ వచ్చేస్తున్నట్టు తెలిపింది. అదే రోజున ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో అభిమానుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీసు రికార్డులను బద్దలుగొట్టింది. ఏకంగా రూ. 1000 కోట్ల వసూళ్లు రాబట్టింది.
Go Back to Shorts
RRR
Rajamouli
NTR
Ramcharan

More Telugu News