Sajjala Ramakrishna Reddy: నారాయ‌ణ ఏమైనా విప్ల‌వ‌కారుడా?.. ఆయ‌న అరెస్ట్‌పై అంత గ‌గ్గోలు ఎందుకు?: స‌జ్జ‌ల

sajjala fires on tdpover its reaction on narayana arrest
షార్ట్స్‌లో చూడండి
టెన్త్ ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారంలో అరెస్టయిన మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ వ్య‌వ‌హారంపై టీడీపీ అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తోంద‌ని ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నారాయ‌ణ ఏదో విప్ల‌వ‌కారుడైన‌ట్లు ఆయ‌న అరెస్ట్‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌హా ఆ పార్టీ నేత‌లు అంత గ‌గ్గోలు చేయ‌డం ఏమిటంటూ స‌జ్జ‌ల మండిప‌డ్డారు. ఈ మేర‌కు బుధ‌వారం నారాయ‌ణ అరెస్ట్‌, అనంత‌ర ప‌రిణామాల‌పై మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా స‌జ్జ‌ల ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌శ్నా ప‌త్రాల లీకేజీని టీడీపీ నేత‌లు ప్ర‌భుత్వ వైఫ‌ల్యంగా అభివ‌ర్ణించిన విష‌యాన్ని గుర్తు చేసిన స‌జ్జ‌ల‌.. అలాంట‌ప్పుడు త‌మ ప్ర‌భుత్వం ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దా? అంటూ ప్ర‌శ్నించారు. 100 శాతం ఉత్తీర్ణ‌త కోస‌మే కొన్ని విద్యా సంస్థ‌లు పేప‌ర్ లీక్‌, మాల్ ప్రాక్టీస్ వంటి అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నాయని ఆయ‌న ఆరోపించారు. ఇందులో భాగంగానే నారాయ‌ణ అరెస్ట్ అయ్యార‌ని సజ్జ‌ల చెప్పారు.
Go Back to Shorts
Sajjala Ramakrishna Reddy
YSRCP
P Narayana

More Telugu News