ఎంపీ నవనీత్ కౌర్ దంపతుల బెయిల్ రద్దు చేయండి: ముంబై కోర్టులో పోలీసుల పిటిషన్
- హనుమాన్ ఛాలీసా వివాదంలో కౌర్ దంపతుల అరెస్ట్
- ముంబై సెషన్స్ కోర్టు బెయిలివ్వడంతో ఇటీవలే విడుదల
- కోర్టు నిబంధనలు ఉల్లంఘించారని కౌర్ దంపతులపై ఆరోపణ
హనుమాన్ జయంతి నాడు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ ఛాలీసాను పఠించాలని డిమాండ్ చేసిన కౌర్ దంపతులు... సీఎం పఠించని పక్షంలో హనుమాన్ ఛాలీసాను ఆయన ఇంటి ముందు తామే పఠిస్తామంటూ ప్రకటించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన శ్రేణులు కౌర్ దంపతుల ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా ముంబైలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా... జాతి విద్వేష వ్యాఖ్యలు చేశారంటూ వారిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.