తనపై తానే ఆసక్తికర వ్యాఖ్యలు చేసుకున్న ఇమ్రాన్ ఖాన్.. వీడియో వైరల్
- యూకే పర్యటనకు వెళ్లి వచ్చిన అనంతరం గతంలో ఇమ్రాన్ వ్యాఖ్యలు
- యూకేకి వెళ్లినప్పుడు సాదర ఆహ్వానమే దక్కిందని వివరణ
- యూకేను తాను ఎప్పుడూ తన సొంత దేశం అని అనుకోలేదని వ్యాఖ్య
- గాడిద ఎక్కడున్నా గాడిదేనని చెప్పిన వైనం
ఎందుకంటే తాను పక్కా పాకిస్థానీనని చెప్పారు. ఒక గాడిదకు చారలు పెట్టినంత మాత్రాన అది కంచర గాడిద అయిపోదని, గాడిద ఎక్కడున్నా గాడిదేనని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ నెటిజన్లు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. కాగా, పదవిని కోల్పోయినప్పటి నుంచి పాకిస్థాన్ నెటిజన్లు ఇమ్రాన్ ఖాన్ పాత వీడియోలను పోస్ట్ చేస్తూ అనేక రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు.