రాహుల్ గాంధీ చేతికి రక్ష కట్టిన సీతక్క... భుజం తట్టిన కాంగ్రెస్ అగ్రనేత
- తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ
- వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ రైతు సంఘర్షణ సభ
- ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రాహుల్ పరామర్శ
ఇంతలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి సీతక్క ఎదురురావడంతో రాహుల్ చిరునవ్వు నవ్వారు. రాహుల్ ను పలకరించిన సీతక్క తనతో పాటు తెచ్చిన రక్షను రాహుల్ చేతికి కట్టారు. సీతక్క ఆప్యాయతకు స్పందనగా రాహుల్ గాంధీ ఆమె భుజం తట్టారు. అనంతరం ఇతర కాంగ్రెస్ నేతల నుంచి అభివాదాలను స్వీకరిస్తూ వేదికపైకి సాగారు.