'కేజీఎఫ్ 3' ఎలా మొదలవుతుందన్నదే హాట్ టాపిక్!
- 'కేజీఎఫ్ 2' రెస్పాన్స్ పై యశ్ ఖుషీ
- రెండో భాగంలో కొన్ని సీన్స్ పెట్టలేకపోయామంటూ వ్యాఖ్య
- పార్టు 3లో ఆ సీన్స్ పెడతామంటూ వెల్లడి
- సెకండ్ పార్టుకు మించి ఉంటుందంటూ స్పష్టం చేసిన యశ్
'కేజీఎఫ్ 2' కోసం నేను .. ప్రశాంత్ నీల్ కొన్ని సీన్స్ అనుకున్నాము. అయితే కొన్ని కారణాల వలన, ఆ సన్నివేశాలను సెకండ్ పార్టులో ఎగ్జిక్యూట్ చేయలేకపోయాము. ఆ సన్నివేశాలన్నీ కూడా పార్టు 3లో రూపుదిద్దుకుంటాయి. సెకండ్ పార్టుకు మించి థర్డ్ పార్టు ఉంటుందనీ, సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పడుతుంది" అని చెప్పుకొచ్చాడు.
అయితే 'కేజీఎఫ్ 2'లో తాను కూడబెట్టిన బంగారమంతా తీసుకుని షిప్పులో సముద్రంలోకి వెళ్లిన రాకీ భాయ్ అక్కడ చనిపోయినట్టుగా చూపించారు. అంతకుముందే అతని భార్య కూడా అధీర కారణంగా ప్రాణాలు కోల్పోతుంది. దాంతో ఇప్పుడు 'కేజీఎఫ్ 3' ఎక్కడి నుంచి మొదలవుతుంది? అనే ఆసక్తి అందరిలో మొదలైంది.