Sajjala Ramakrishna Reddy: నా కోరిక ఇదే: సజ్జల రామకృష్ణారెడ్డి

Chandrababu should not come into power says Sajjala Ramakrishna Reddy
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు మళ్లీ రాకూడదని... ఇదే తన కోరిక అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు లాంటి వాళ్లకు దేవతానుగ్రహం ఉండకూడదని తాను కోరుకుంటున్నానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని అన్నారు. పోలవరం ఆలస్యానికి చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలే కారణమని ఆయన విమర్శించారు.  

ఒంగోలు కారు ఘటనపై సీఎం జగన్ వెంటనే స్పందించారని సజ్జల అన్నారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పారు. కింద స్థాయి అధికారి చేసిన తప్పుకు మొత్తం ప్రభుత్వాన్నే తప్పు పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని... ప్రస్తుతం ఆయన సంధికాలంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును జనాలు ఇన్నాళ్లు భరిస్తూ వస్తున్నారని సజ్జల అన్నారు.
Go Back to Shorts
Sajjala Ramakrishna Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News