Ujwal Kulkarni: కేజీఎఫ్-2 ఎడిట‌ర్ 19 ఏళ్ల ఈ కుర్రాడేన‌ట‌!

19 Years old Ujwal Kulkarni is the editor of kgf 2
షార్ట్స్‌లో చూడండి
క‌న్న‌డ మూవీ కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 క‌లెక్ష‌న్ల సునామీనే సృష్టిస్తోంది. గురువారం నాడు విడుద‌లైన ఈ సినిమా అటు క‌న్న‌డతో పాటుగా ఇటు బాలీవుడ్‌, టాలీవుడ్‌లోనూ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో క‌న్న‌డ స్టార్ యాక్ట‌ర్ య‌శ్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రంపై ప్ర‌శంస‌లు జ‌ల్లు కురుస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణుల విష‌యానికి సంబందించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

గ్రాఫిక్స్‌తో పాటు అద్భుత‌మైన లొకేష‌న్ల‌లో చిత్రీక‌ర‌ణ జ‌రిగిన ఈ సినిమాకు ఓ 19 ఏళ్ల కుర్రాడు ఎడిట‌ర్‌గా ప‌నిచేశాడు‌. భారీ బ‌డ్జెట్ సినిమాకు నిండా 20 ఏళ్లు కూడా నిండ‌ని కుర్రాడితో ఎడిటింగ్ ఎలా చేయించారా? అన్న విష‌యంపై సినీ వ‌ర్గాల్లో ఆసక్తి నెలకొంది. క‌ర్ణాట‌క‌కే చెందిన 19 ఏళ్ల వ‌య‌సున్న ఉజ్వ‌ల్ కుల‌క‌ర్ణి అనే యువ‌కుడితో ప్ర‌శాంత్ నీల్ సినిమా ఎడిటింగ్‌ను పూర్తి చేయించాడ‌ట‌. కుల‌క‌ర్ణి ప్ర‌తిభ‌కు అచ్చెరువొందిన నేప‌థ్యంలోనే అత‌డితో ప్ర‌శాంత్ నీల్ ఎడిటింగ్ చేయించినట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.
Go Back to Shorts
Ujwal Kulkarni
KGF 2
Prashant neel
Yash

More Telugu News