పని మొదలెట్టేసిన 'టైగర్ నాగేశ్వరరావు'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పని మొదలెట్టేసిన 'టైగర్ నాగేశ్వరరావు'

Raviteja in Tiger Nageshwara Rao Movie
  • 'టైగర్ నాగేశ్వరరావు' గా రవితేజ
  •  స్టూవర్టుపురం దొంగ చుట్టూ తిరిగే కథ  
  • మొదలైపోయిన రెగ్యులర్ షూటింగ్
  • కథానాయికలుగా నుపుర్ సనన్ - గాయత్రి 
రవితేజ తన సినిమాల విషయంలో తన వైపు నుంచి ఎలాంటి ఆలస్యం లేకుండా చూసుకుంటాడు. అందువల్లనే మొదటి నుంచి వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ, షూటింగుకి ఆలస్యంగా వస్తాడనే రిమార్క్ ఎక్కడా కనిపించదు .. వినిపించదు. ఒకసారి కథను లాక్ చేసిన తరువాత ఇక ఆ విషయంలో ఆయన జోక్యం చేసుకోరు.
 
ఆయన తాజా చిత్రంగా థియేటర్లకు రావడానికి 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా రెడీగా ఉంది. ఈ నేపథ్యంలోనే 'టైగర్ నాగేశ్వరరావు' ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించారు. ఈ సినిమాలో స్టూవర్టుపురం దొంగగా రవితేజ కనిపించనున్నాడు. అయితే ఆల్రెడీ సెట్స్ పై ఉన్న 'ధమాకా' .. 'రావణాసుర' షూటింగ్స్ పూర్తయిన తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకావొచ్చని అనుకున్నారు. 

 కానీ అప్పుడే ఈ సినిమా షూటింగును మొదలు పెట్టేశారు. నైట్ ఎఫెక్ట్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు మేకర్స్ చెప్పారు. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. రవితేజ సరసన నాయికలుగా నుపుర్ సనన్ .. గాయత్రి భరద్వాజ్ అందాల సందడి చేయనున్నారు.
Raviteja
Nupur sanon
Vamsee Movie

More Telugu News