ఎన్టీఆర్ జిల్లాలో విద్యార్థుల మ‌ధ్య గ్యాంగ్ వార్‌.. ఇన్‌స్టాలో పోస్టులే కార‌ణ‌మ‌ట‌
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ జిల్లాలో విద్యార్థుల మ‌ధ్య గ్యాంగ్ వార్‌.. ఇన్‌స్టాలో పోస్టులే కార‌ణ‌మ‌ట‌

gangwar between two groups of mic college in ntr district
  • మిక్ కాలేజీలో విద్యార్థుల మ‌ధ్య ఘర్ష‌ణ‌
  • హాకీ స్టిక్‌లు, రాడ్ల‌తో దాడి చేసుకున్న వైనం
  • ప‌లువురు విద్యార్థుల‌కు గాయాలు, ఆసుప‌త్రికి త‌ర‌లింపు
ఏపీలోని కొత్త‌గా ఏర్పాటైన ఎన్టీఆర్ జిల్లాలో సోమ‌వారం గ్యాంగ్ వార్ చోటుచేసుకుంది. విజ‌య‌వాడ స‌మీపంలోని కంచిక‌చ‌ర్ల‌కు చెందిన మిక్ క‌ళాశాల‌కు చెందిన విద్యార్థుల మ‌ధ్య చెల‌రేగిన ఓ వివాదం చిలికి చిలికి గాలి వాన‌లా మారింది. ఇరువ‌ర్గాలుగా విడిపోయిన విద్యార్థులు హాకీ స్టిక్‌లు, ఐర‌న్ రాడ్లు చేత‌బ‌ట్టి ఒక‌రిపై మ‌రొక‌రు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ప‌లువురు విద్యార్థుల‌కు గాయాలు కాగా.. వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

క‌ళాశాలకు చెందిన విద్యార్థుల గ్రూపుల్లో ఇన్‌స్టాగ్రాంలో ప్ర‌త్య‌క్ష‌మైన పోస్టుల‌తో వివాదం రేకెత్తింది. ఈ వివాదం వాగ్వాదాల‌కు మాత్ర‌మే ప‌రిమితం కాకుండా ఏకంగా గ్యాంగ్ వార్‌కు దారి తీసింది. ఇరు వ‌ర్గాలుగా విడిపోయిన విద్యార్థులు చేతికి అందిన హాకీ స్టిక్‌లు, రాడ్ల‌తో ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు వివ‌రాల‌పై ఆరా తీస్తున్నారు.
NTR District
MIC College
Gangwar

More Telugu News