Karthikeya: యూవీ క్రియేషన్స్ బ్యానర్లో కార్తికేయ!

karthikeya in  Prashanth Reddy Movie
షార్ట్స్‌లో చూడండి
ఈ తరం యంగ్ హీరోల్లో మాస్ యాక్షన్ .. రొమాన్స్ పాళ్లు ఎక్కువగా కలిగిన కథలను చేసేవారిలో కార్తికేయ ముందువరుసలో కనిపిస్తాడు. ఆయనకి వరుస అవకాశాలు వస్తున్నాయిగానీ, అవి విజయాలుగా మారడం లేదు. దాంతో మరో మెట్టుపైకి చేరుకోవడానికి కాస్త ఆలస్యమే అవుతుంది. ఆ మధ్య ఆయన చేసిన 'రాజా విక్రమార్క' కూడా ఆశించిన స్థాయిని అందుకోలేకపోయింది.

ఆయితే ఆ తరువాత ఆయన తమిళంలో విలన్ గా చేసిన 'వలిమై' అక్కడ బాగానే ఆడటం ఆయనకి కాస్త ఊరటను కలిగించే విషయం. ఈ నేపథ్యంలో తెలుగులో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. అందుకు సమాధానం రానే వచ్చేసింది. ప్రస్తుతం ఆయన యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

 ఇటీవలే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కినట్టుగా చెబుతున్నారు. కెరియర్ పరంగా కార్తికేయకు ఇది 8వ సినిమా. ఈ సినిమాకి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సమాచారాన్ని తాజాగా ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు. త్వరలోనే టైటిల్ ను ఖరారు చేసి ప్రకటిస్తామని అన్నారు. అప్పుడు మిగతా విషయాలు తెలిసే అవకాశం ఉంది.
Go Back to Shorts
Karthikeya
Prashanth Reddy
UV Creations

More Telugu News