Anil Kumar Yadav: మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ స్పందన!

I proud to be soldier of Jagan says Anil Kumar Yadav
షార్ట్స్‌లో చూడండి
ఏపీ కేబినెట్ లోని 24 మంది మంత్రులు నిన్న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ కు వారంతా రాజీనామా లేఖలను అందించారు. ఈ నెల 11న కొత్త కేబినెట్ ఏర్పడనుంది. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, మంత్రిగా పని చేయడం కంటే... జగన్ సైనికుడిగా పని చేయడమే తనకు ఇష్టమని చెప్పారు.

రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గంలో మార్పులు ఉంటాయని జగన్ ముందే చెప్పారని... అందులో భాగంగానే మంత్రులు అందరూ రాజీనామాలు చేశారని అనిల్ తెలిపారు. మంత్రులందరం చాలా సంతోషంగా రాజీనామాలు చేశామని చెప్పారు. 2024లో వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని అన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మరి కొందరికి మంత్రులుగా అవకాశం వస్తుందని చెప్పారు. పార్టీ కోసం పని చేసే గొప్ప అవకాశాన్ని జగన్ తమకు ఇస్తున్నారని తెలిపారు.
Go Back to Shorts
Anil Kumar Yadav
Jagan
YSRCP

More Telugu News