వీడ్కోలు విందు ఏర్పాటు చేసిన మంత్రి పేర్ని నాని
- ఈరోజు రాజీనామాలు చేయనున్న ఏపీ మంత్రులు
- మీడియా ప్రతినిధులకు వీడ్కోలు విందు ఏర్పాటు చేసిన పేర్ని నాని
- ఊపిరి ఉన్నంత వరకు మీడియాను గుర్తుంచుకుంటానని వ్యాఖ్య
ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ, తనకు ఊపిరి ఉన్నంత వరకు మీడియాను గుర్తుంచుకుంటానని చెప్పారు. ఈ మూడేళ్లలో మీడియా మిత్రులందరినీ పేరుతో పిలిచేంత దగ్గరయ్యానని అన్నారు. మంత్రిగా తనకు అవకాశం ఇచ్చిన జగన్ రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనని చెప్పారు.