హైద‌రాబాద్‌లోని ప‌బ్‌లో పోలీసుల‌కు ప‌ట్టుబ‌డిన వారిలో సినీన‌టి నిహారిక‌.. ప‌బ్‌లో డ్ర‌గ్స్ ల‌భ్యం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైద‌రాబాద్‌లోని ప‌బ్‌లో పోలీసుల‌కు ప‌ట్టుబ‌డిన వారిలో సినీన‌టి నిహారిక‌.. ప‌బ్‌లో డ్ర‌గ్స్ ల‌భ్యం

niharika gets notice
  • నిహారిక‌కు పోలీసులు నోటీసులు
  • పోలీసుల‌కు చిక్కిన‌ మ‌రికొంద‌రి ప్ర‌ముఖుల పిల్ల‌లు
  • పబ్‌లో కొకైన్, గంజాయి, ఎల్‌ఎస్‌డీ గుర్తింపు
  • కొన‌సాగుతున్న పోలీసుల‌ విచార‌ణ‌
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌పై గ‌త అర్ధ‌రాత్రి దాటిన అనంత‌రం పోలీసులు దాడులు చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన కీల‌క వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. పబ్‌లో పోలీసులు కొకైన్, గంజాయి, ఎల్‌ఎస్‌డీ గుర్తించారు. పోలీసులకు పట్టుబడిన వారిలో సినీ నటి నిహారిక కూడా ఉంది. ఆమెతో పాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చి ఇంటికి పంపిన‌ట్లు తెలుస్తోంది.

అంతేగాక‌, పోలీసుల‌కు చిక్కిన వారిలో మరికొందరి ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు స‌మాచారం. పబ్‌లో ఎవరెవరు డ్రగ్స్‌ తీసుకున్నారన్న విష‌యంపై పోలీసులు ఆరా తీస్తున్న‌ట్లు తెలుస్తోంది. పబ్‌లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు కొన‌సాగుతోంది. పోలీసులు వ‌చ్చార‌ని తెలుసుకున్న వెంట‌నే కొంద‌రు త‌మ వ‌ద్ద ఉన్న డ్ర‌గ్స్‌ను బ‌య‌ట ప‌డేసే ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్లు తెలిసింది. కాగా, పోలీసుల‌కు పట్టుబడిన యువకులు పోలీస్ స్టేషన్‌లో నానా హంగామా చేయ‌డం గ‌మ‌నార్హం. తమను ఎందుకు తీసుకువచ్చారని ర‌చ్చ చేశారు.   

              

Niharika
Tollywood
Hyderabad
Police

More Telugu News