ట్రిపుల్ ఆర్ సినిమాను 12 సార్లు చూశా: విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్ మోహన్
Add ap7am to your home Screen

ట్రిపుల్ ఆర్ సినిమాను 12 సార్లు చూశా: విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్ మోహన్

was seen 12 times Srinivas mohan says about RRR
  •  మళ్లీ మళ్లీ చూడాలని ఉందంటూ ట్వీట్
  • చూసిన ప్రతిసారి రెట్టింపు ఉత్సాహం వస్తోందంటూ వ్యాఖ్య  
  • పలు సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ పర్యవేక్షకుడిగా పనిచేసిన మోహన్
ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాను తాను ఇప్పటి వరకు 12 సార్లు చూసినట్టు ఆ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ కోసం పనిచేసిన విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్ మోహన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వినిపిస్తోంది. 

ఈ సందర్భంగా శ్రీనివాస్ మోహన్ ట్వీట్ చేస్తూ.. దీనిని ఇప్పటికే 12సార్లు చూశానని, అయినా మళ్లీ మళ్లీ చూడాలనే అనిపిస్తోందని అన్నారు. చూసిన ప్రతిసారి తనలో రెట్టింపు ఉత్సాహం వస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు ప్రేక్షకుల స్పందన చూడాలని ఉందన్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా సాధారణ థియేటర్లతోపాటు డాల్బీ విజన్/డాల్బీ అట్మాస్, 3డి, ఐమ్యాక్స్ ఫార్మాట్లలో విడుదల అయింది. అంతేకాదు, డాల్బీ విజన్‌లో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రంగానూ ఆర్ఆర్ఆర్ రికార్డులకెక్కింది. కాగా, ‘2ఓ’, ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘రోబో’ వంటి చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ పర్యవేక్షకుడిగా శ్రీనివాస్ మోహన్ పనిచేశారు.
RRR
NTR
Ramcharan
Srinivas Mohan

More Telugu News