రాజకీయాలకు ఆజాద్ గుడ్‌బై?
- సమాజంలో రాజకీయ పార్టీలు మార్పు తీసుకురాకపోతే సామాజిక సేవా సంస్థలే బాధ్యత తీసుకోవాలి
- నేను ఆ దిశగా అడుగులేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు
- సన్మాన సభలో ఆజాద్ వ్యాఖ్యలు
సమాజంలో మార్పు తీసుకురావడంలో రాజకీయ పార్టీలు విఫలమైనప్పుడు సామాజిక సంస్థలే ఆ బాధ్యత తీసుకోవాలన్నారు. ఇందుకోసం తాను రాజకీయాల నుంచి తప్పుకుని సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటూ, ప్రస్తుతం తనలో అదే ఆలోచన ఉన్నట్టు చెప్పకనే చెప్పారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత ఆజాద్ త్వరలోనే రాజకీయాలకు గుడ్‌బై చెబుతారన్న ప్రచారం జోరందుకుంది.