బాలయ్యను ఒప్పించే పనిలో అనిల్ రావిపూడి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలయ్యను ఒప్పించే పనిలో అనిల్ రావిపూడి!

Kalyan Ram in Anil Ravipudi Movie
  • గోపీచంద్ మలినేని సినిమాతో బాలయ్య 
  • 'ఎఫ్ 3' పనిలో బిజీగా అనిల్ రావిపూడి 
  • ఇద్దరి కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా 
  • ముఖ్యమైన పాత్రలో కల్యాణ్ రామ్
రాజమౌళి .. కొరటాల తరువాత ఇంతవరకూ ఫ్లాప్ అనేది చూడని దర్శకుడిగా అనిల్ రావిపూడి కనిపిస్తాడు. జంధ్యాల తనకి ఆదర్శం అని చెప్పుకునే అనిల్ రావిపూడి, తన సినిమాల్లో కామెడీ పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండా చూసుకుంటాడు. ఆయన సినిమాల్లోని కామెడీ సీన్స్ తలచుకుని తలచుకుని నవ్వుకునేలా ఉంటాయి. 

తాజాగా ఆయన 'ఎఫ్ 3' సినిమాను రూపొందిస్తున్నాడు. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ హీరోలుగా పూర్తి వినోదభరితంగా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాను ఆయన బాలకృష్ణతో చేయనున్నాడు. ఈలోగా గోపీచంద్ మలినేని సినిమాను బాలకృష్ణ పూర్తిచేస్తారన్న మాట. 

బాలకృష్ణ సినిమాలో కల్యాణ్ రామ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నాడని అంటున్నారు. ఈ పాత్ర ఈ సినిమాకి హైలైట్ అవుతుందనీ, కల్యాణ్ రామ్ కెరియర్లో చెప్పుకోదగినది అవుతుందని చెబుతున్నారు. తనకి మొదటి ఛాన్స్ ఇచ్చిన కల్యాణ్ రామ్ పట్ల గల కృతజ్ఞతతోనే అనిల్ రావిపూడి ఈ నిర్ణయం తీసుకున్నాడనీ, ఈ విషయంలో బాలయ్యను ఒప్పించేపనిలో ఉన్నాడని అంటున్నారు.
Balakrishna
Kalyan Ram
Anil Ravipudi Movie

More Telugu News