Andhra Pradesh: ఏపీలో 88 మందికి కరోనా పాజిటివ్... తాజా వివరాలు ఇవిగో!

AP Corona updates
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా రోజువారీ కేసులు 100కి లోపే నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 12,208 కరోనా పరీక్షలు నిర్వహించగా, 88 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లాలో 28, ప్రకాశం జిల్లాలో 12 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 97 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్కరోజులో కరోనాతో ఎలాంటి మరణాలు సంభవించలేదు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,705 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,03,227 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 749 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 14,729 మంది చనిపోయారు.
.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Updates
Daily Updates

More Telugu News