Andhra Pradesh: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

AP records 70 Corona cases
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. గత 24 గంటల్లో కేవలం 70 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 13 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 24 గంటల్లో కరోనా కారణంగా ఒక్క మరణం కూడా సంభవించలేదు. 

ఇదే సమయంలో 129 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 23,18,617కి చేరింది. ఇప్పటి వరకు 23,03,130 మంది కరోనా నుంచి కోలుకోగా... 14,729 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 758 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus

More Telugu News