చిత్రగుప్తుడి ‘హార్డ్ డిస్క్’ అంతా మీ పాపాల చిట్టాతో ఏనాడో నిండిపోయింది: విజ‌య‌సాయిరెడ్డి

vijay sai slams tdp
  • దశాబ్దాలుగా మీరు చేసిన అరాచకాలు, కిరాతకాలు లెక్కకు చిక్కుతాయా? 
  • సుపారీ హత్యల సంస్కృతి మొదలు పెట్టిందెవరు? 
  • పెనుకొండ నుంచి మచిలీపట్నం దాకా హత్యలు
  • ఉసురు తగలకుండా తప్పించుకోగలరా?
టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, యువ‌నేత నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ''చిత్ర గుప్తుడి ‘హార్డ్ డిస్క్’ అంతా మీ పాపాల చిట్టాతో ఏనాడో నిండిపోయింది బాబు గారూ. దశాబ్దాలుగా మీరు చేసిన అరాచకాలు, కిరాతకాలు లెక్కకు చిక్కుతాయా? సుపారీ హత్యల సంస్కృతి మొదలు పెట్టిందెవరు? పెనుకొండ నుంచి మచిలీపట్నం దాకా చేయించిన హత్యల ఉసురు తగలకుండా తప్పించుకోగలరా?

ఎక్కడైనా పెన్షన్లు, అమ్మఒడి లబ్దిదారులకు అన్యాయంగా నిధులు నిలిపేస్తే వివరాలు బయటపెట్టొచ్చు గదా మాలోకం. ప్రజలకు మేలు చేసిన వాడివి అవుతావు. అబద్ధాల తుంపర వెదజల్లడం తప్ప సంక్షేమం గురించి నీకేం తెలుసు? తండ్రి నేర్పిన విద్యతో గుడ్డ కాల్చి మొహం మీద విసరడం పరమ నీచం కదా!'' అని విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.
Go Back to Shorts
Vijayasai Reddy
YSRCP
Telugudesam

More Telugu News