Vijayasai Reddy: జయలలిత స్టయిల్లో శపథం చేశారు: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు

Vijayasai Reddy satires on Chandrababu
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి అయ్యాకే మళ్లీ శాసనసభలో అడుగుపెడతానని జయలలిత స్టయిల్లో చంద్రబాబు శపథాలు చేశారని ఆయన అన్నారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అని సమీక్షలు చేస్తున్నారని విమర్శించారు.

ఏడు పదులు దాటిన వయసులో ఈ ఉత్తుత్తి శపథాలు అవసరమా బాబూ? అని ప్రశ్నించారు. ఇకపై మీకు అసెంబ్లీకి వెళ్లే అవకాశమే రాదని అన్నారు. అసెంబ్లీని మీరు బహిష్కరించాల్సిన అవసరం లేదని... ప్రజలే మిమ్మల్ని అసెంబ్లీ నుంచి బహిష్కరిస్తారని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News