ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు మహారాష్ట్రలో... ప్లేఆఫ్ మ్యాచ్ లు గుజరాత్ లో!
- భారత్ లోనే ఐపీఎల్!
- కరోనా నేపథ్యంలో పరిమిత వేదికల్లో మ్యాచ్ లు
- త్వరలో ఆటగాళ్ల వేలం
మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో స్టేడియాలు అందుబాటులో ఉన్నాయి. ముంబయిలో వాంఖెడే స్టేడియం, బ్రాబౌర్న్ స్టేడియం, నవీ ముంబయిలో డీవై పాటిల్ స్టేడియం, పూణే సమీపంలో మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఉన్నాయి. వీటిలో లీగ్ మ్యాచ్ లు నిర్వహిస్తే, ప్లేఆఫ్ మ్యాచ్ లను గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరపొచ్చన్నది బీసీసీఐ ప్రణాళికగా తెలుస్తోంది.
అటు, ఐపీఎల్ ఆటగాళ్ల వేలానికి ఫ్రాంచైజీలు సమాయత్తమవుతున్నాయి. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా మెగా వేలం జరగనుంది.