కోలుకున్న కమలహాసన్.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోలుకున్న కమలహాసన్.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

Kamal Haasan discharged from hospital
  • సోమవారం ఆసుపత్రిలో చేరిన కమల్
  • ఆరోగ్యంపై అభిమానుల ఆందోళన
  • కమల్ ఆరోగ్యంగా ఉన్నారన్న వైద్యులు
  • 25 నుంచి ‘విక్రం’ షూటింగులో పాల్గొననున్న కమల్
కరోనా నుంచి కోలుకున్న ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కరోనా బారినపడిన కమల్ గతేడాది నవంబరులో దాదాపు పది రోజులకుపైగానే ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కోలుకుని తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్’ షోలో పాల్గొన్నారు.

అయితే, సోమవారం మరోమారు పోరూరులోని ఆసుపత్రిలో చేరడంతో ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, ఆయన సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రిలో చేరారని తెలిసింది. వైద్య పరీక్షల అనంతరం కమల్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించడంతో నిన్న ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. కాగా, లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘విక్రం’ షూటింగులో ఈ నెల 25 నుంచి కమల్ పాల్గొంటారని సమాచారం.
Kamal Haasan
Vikram
Hospital
Kollywood

More Telugu News